News April 21, 2024
IPL: సగం మ్యాచులు ముగిశాయి.. అగ్రస్థానం ఎవరిదంటే?

ఐపీఎల్ 2024లో లీగ్ దశలో సగం మ్యాచులు ముగిశాయి. పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉండగా.. రెండు పాయింట్లతో ఆర్సీబీ అట్టడుగున ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ(361), అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా(13) ఉన్నారు. ఇప్పటికే పలు సంచలనాలు నమోదు కాగా.. మున్ముందు ఇంకెన్ని నమోదవుతాయో వేచి చూడాలి.
Similar News
News March 28, 2026
హైదరాబాద్‌లో శ్రీరామనవమి వేళ అద్భుత దృశ్యం

హైదరాబాద్ VSTలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అద్భుత దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అంబరాన్ని తాకేలా వెలిసిన రాముడి భారీ కటౌట్ వెనుక ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి మెరుపు ఆ వేడుకకు మరింత వెలుగును తెచ్చింది. అల్లకల్లోలమైన ఆకాశం, ఉరుములు మెరుపుల సాక్షిగా కోదండ రాముడు నిశ్చలంగా, ధైర్యంగా నిలబడ్డ దృశ్యం చూసి ప్రకృతి కూడా ఆ రామయ్యకు నీరాజనాలు అర్పిస్తున్నాయా? అన్నట్లు ఉంది.
PIC CRD: @sumanreddy_d
News March 28, 2026
RCB Vs SRH.. పైచేయి ఎవరిదంటే?

IPLలో RCB, SRH మధ్య ఇప్పటిదాకా 26 మ్యాచ్‌లు జరిగాయి. 11 సార్లు RCB, 14 సార్లు SRH గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2024 ఎడిషన్‌లో SRH అత్యధిక స్కోరు(287/3) నమోదు చేయగా, 2022లో RCB అత్యల్ప పరుగులు(68/10) చేసింది. బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ SRHపై 805 రన్స్ చేశారు. ఆ జట్టుపై ఎక్కువ మ్యాచ్‌లు(24) ఆడింది కూడా కోహ్లీనే. రేపు రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది.
News March 28, 2026
ఎలాంటి సమస్య రాదు.. ప్రభుత్వాన్ని నమ్మండి: అమిత్ షా

దేశంలో ఎలాంటి సమస్య రాదని, ఆయిల్, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. రూమర్లను నమ్మి పానిక్ కావద్దని, ప్రభుత్వాన్ని నమ్మాలని కోరారు. ఏ యుద్ధంలోనూ జోక్యం చేసుకోవాలని భారత్ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంపై స్పందిస్తూ.. సంక్షోభం భారాన్ని తనపై వేసుకున్న దేశం ఇండియా ఒక్కటేనని, ప్రపంచంలో ఇంకోటి లేదని Times Now సమ్మిట్‌లో అన్నారు.


