News April 4, 2025

IPL: మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు

image

SRH తరఫున బరిలోకి దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌‌ ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ నిష్నిని వివాహమాడారు. అంతకుముందే హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ కోసం దాన్ని క్యాన్సిల్ చేసుకుని కోల్‌కతా వచ్చేశారు. ఒకే ఓవర్ వేసిన అతడు ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నారు. 29 రన్స్‌ చేసి పర్వాలేదనిపించారు. వేలంలో అతడిని SRH రూ.75 లక్షలకు దక్కించుకుంది.

Similar News

News April 4, 2025

చరిత్ర సృష్టించాడు!

image

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లతో సత్తా చాటారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఫైఫర్ తీసిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. 4 ఓవర్లలో 36 పరుగులకు పూరన్, పంత్, మార్క్‌రమ్, మిల్లర్, ఆకాశ్ దీప్ వికెట్లను తీశారు. ఆయన టీ20 కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.

News April 4, 2025

‘వక్ఫ్’ తరహాలోనే పార్లమెంటులో సుదీర్ఘ చర్చలివే!

image

వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలు, రాజ్యసభలో 17 గంటల పాటు చర్చ జరిగింది. ఇదొక అరుదైన విషయమని RS ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. అయితే గతంలోనూ పార్లమెంటులో మారథాన్ చర్చలు జరిగాయి. LSలో స్టేట్ ఆఫ్ అవర్ డెమొక్రసీపై 20.8గంటలు, రైల్వే బడ్జెట్‌పై 1993లో 18.35గంటలు, 1988లో 19.04గంటలు, మైనార్టీల భద్రత బిల్లుపై 17.25గంటలు, 1981లో RSలో ఎసెన్షియల్ సర్వీసెస్ బిల్లుపై 16.88గంటల చర్చ జరిగింది.

News April 4, 2025

కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ రూపొందించండి: సీఎం రేవంత్

image

TG: విషయ పరిజ్ఞానంతో పాటు జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ ఛైర్మన్ ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో అమలవుతున్నవిద్యా విధానాలను ఛైర్మన్ ఆకునూరి మురళి, మాజీ IAS జయప్రకాశ్ నారాయణ, సీఎంకు వివరించారు.

error: Content is protected !!