News October 25, 2024
IPL: అత్యధిక జట్లకు ఆడిన ప్లేయర్ ఇతడే

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఏకంగా 9 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. RR, DC, PWI, SRH, MI, GL, PBKS, RCB, KKR జట్లకు ఆయన ఆడారు. ఆయన తర్వాత జయదేవ్ ఉనద్కత్ (8) ఉన్నారు. ఉనద్కత్ KKR, RCB, DC, RPS, RR, MI, LSG, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మనీశ్ పాండే, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, తిసారా పెరీరా, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్ 6 జట్లకు ఆడారు.
Similar News
News March 17, 2025
అనారోగ్యంతో సీనియర్ నటి కన్నుమూత

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూశారు. చెన్నైలో నిన్న తుదిశ్వాస విడువగా ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. 1982లో తమిళ సినిమా ‘కోళీ కూవుతు’తో కెరీర్ మొదలెట్టి తెలుగులో ‘దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, ప్రాణానికి ప్రాణం’ తదితర సినిమాల్లో నటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన ఆమె అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూవచ్చారు. <<15773373>>ఆమె<<>> భారీగా బరువు తగ్గడంపైనా గతవారం కథనాలు వచ్చాయి.
News March 17, 2025
సిRAW: నా బూతే నా భవిష్యత్తు

ఒకప్పుడు హాస్యం వినసొంపుగా మనసుకి ఆహ్లాదం కలిగించేది. క్రమంగా ద్వంద్వ అర్థాలతో నవ్వించడం మొదలుపెట్టి ఇప్పుడు బూతే నవ్విస్తోంది, నడిపిస్తోంది. కొన్ని టీవీ షోలు, సినిమాలు వెగటు కామెడీతో వెళ్లదీస్తుంటే రాజకీయ నేతల నోటా ఈ రోతలే వినిపిస్తున్నాయి. ‘న భూతో న భవిష్యతి’ కాస్తా ‘నా బూతే నా భవిష్యత్తు’ అనేలా మారింది. పిల్లల్ని ఈ వికృత సంస్కృతికి దూరంగా పెంచకపోతే రేపు బూతే సుభాషితం కావొచ్చు.
News March 17, 2025
BC రిజర్వేషన్ల పెంపు కోసం PM మోదీని కలుద్దాం: CM రేవంత్

TG: BC రిజర్వేషన్ల పెంపు సాధనకై PM మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలని అసెంబ్లీలో CM రేవంత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించేలా పోరాడాలన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన BRS, BJP, MIMతో సహా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.