News May 26, 2024
IPL: ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లు అంటే?

ఇవాళ చెన్నై వేదికగా SRH, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్కు రూ.13 కోట్లు దక్కనున్నాయి. ఇక 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు BCCI అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు తలో రూ.15 లక్షలు, ‘ఎమర్జింగ్ ఫ్లేయర్ ఆఫ్ ది ఇయర్’కు రూ.20 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కు రూ.12 లక్షలు దక్కనున్నాయి.
Similar News
News December 3, 2025
SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.
News December 3, 2025
VKB: అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే చర్యలు: SP

స్థానిక సంస్థల ఎన్నికల ముగిసే వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. వికారాబాద్ పోలీస్ కేంద్ర కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులందరూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు సభలు, సమావేశాలు ర్యాలీలో నిషేధించామన్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు.
News December 3, 2025
‘డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’

రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు పోతున్నట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ను విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.


