News November 26, 2024
IPL: మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే?
ఐపీఎల్ మెగావేలంలో 10 ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 182 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోగా వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 8 మంది ఆటగాళ్లను RTM ద్వారా ఆయా జట్లు దక్కించుకున్నాయి. అత్యధికంగా పంజాబ్ 23 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ 14 మందిని వేలంలో దక్కించుకుంది. ఇంకా ఆర్సీబీ వద్ద అత్యధికంగా రూ.75 లక్షలు మిగిలి ఉన్నాయి.
Similar News
News November 26, 2024
వెంకటేశ్‌కు ‘సంక్రాంతి’ కలిసొస్తుందా?
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. 2005లోనూ సంక్రాంతి సమయంలో ‘సంక్రాంతి’ మూవీతో వెంకీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. దీంతో హిస్టరీ రిపీట్ అవుద్దని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలు పండుగకు విడుదల కానున్నాయి.
News November 26, 2024
భయపెడుతున్న ‘బిర్యానీ’
హైదరాబాద్ అనగానే ఆహారప్రియులకు మొదట గుర్తొచ్చేది ‘బిర్యానీ’. ఇటీవల నగరంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. బిర్యానీలో కుళ్లిన మాంసం, కీటకాలు, సిగరెట్ పీకలకు తోడు ఫుడ్ పాయిజన్ వంటివి కలవరపెడుతున్నాయి. దీంతో బయట తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పరిశుభ్రత పాటించని హోటల్స్‌పై ఫుడ్ సెఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
News November 26, 2024
DEC 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్
TG: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 7న ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని డ్రైవర్స్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు RTA జాయింట్ కమిషనర్‌కు సమ్మె పత్రాన్ని యూనియన్ సభ్యులు అందజేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల పెంపు, కొత్త పర్మిట్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ బీమా రూ.10 లక్షలకు పెంపు, డ్రైవర్లకు ఏటా రూ.12 వేలా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.