News November 25, 2024

IPL: భారత పేసర్లకు భారీ డిమాండ్

image

IPL 2025 మెగా వేలంలో రెండో రోజు కూడా టీమ్ ఇండియా పేసర్లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. వీరిని కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. భువనేశ్వర్-రూ.10.75 కోట్లు, దీపక్ చాహర్-రూ.9.25 కోట్లు, ఆకాశ్ దీప్-రూ.8 కోట్లు, ముకేశ్ కుమార్-రూ.8 కోట్లు, తుషార్ దేశ్‌పాండే-రూ.6.50 కోట్లు పలికారు. స్వదేశీ పిచ్‌లపై వీరు మెరుగ్గా రాణిస్తారని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 25, 2024

పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు: పవన్ కళ్యాణ్

image

APలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పలువురు మంత్రుల భేటీలో అధికారులను ఆదేశించారు. వారసత్వ ప్రాంతాలను కాపాడాలన్నారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిసేలా ప్రచారాలు ఉండాలని, పర్యాటక అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధి చెందాలన్నారు.

News November 25, 2024

సెన్సెక్స్‌, నిఫ్టీలో అక్క‌డ Strong Resistance

image

స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ లాభాలను ఆర్జించినా Day Highని అధిగమించలేదు. సెన్సెక్స్‌లో 80,470 వ‌ద్ద‌, నిఫ్టీలో 24,350 వ‌ద్ద ఉన్న Strong Resistance వ‌ల్ల సూచీలు Consolidation Zoneలోనే ప‌య‌నించాయి. ఉద‌యం 2 సూచీల్లో Pre-Open Marketలో భారీగా బిజినెస్ జరిగింది. ఆ లాభాలు మిన‌హా ఈరోజు ప్ర‌త్యేకించి సూచీలు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. ఉదయం ట్రేడింగ్ Open అయిన స్థాయిలోనే చివరికి Close అయ్యాయి.

News November 25, 2024

ఉమ్రాన్ మాలిక్ అన్‌సోల్డ్

image

SRH స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. మరో పేసర్ జయదేవ్ ఉనద్క‌త్‌ను SRH రూ.కోటి చెల్లించి సొంతం చేసుకుంది. ఇషాంత్ శర్మను గుజరాత్ రూ.75లక్షలకు, నువాన్ తుషారాను బెంగళూరు రూ.1.6 కోట్లకు కొన్నాయి. ఇక ఉమేశ్ యాదవ్, నవీన్ ఉల్ హక్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్ అయ్యారు.