News March 31, 2024
IPL: హైదరాబాద్ ఓటమి

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో SRH ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు రాణించడంతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. GT బ్యాటర్లలో సుదర్శన్(45), మిల్లర్(44*), గిల్(36) రాణించారు.
Similar News
News February 4, 2026
ఇంద్రకీలాద్రిపై 13 నుంచి శివరాత్రి ఉత్సవాలు

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 13 నుంచి 20 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను వధూవరులుగా అలంకరిస్తారు. 15న త్రికాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మహాన్యాసం, లింగోద్భవ కాలంలో అభిషేకాలు, కళ్యాణోత్సవం జరుగుతుంది. 16న సాయంత్రం రథోత్సవం ఉంటుంది.
News February 4, 2026
పీరియడ్స్‌లో రొమ్ము నొప్పి సహజమేనా?

కొంతమంది మహిళలకు పీరియడ్స్‌కి ముందు రొమ్ములు సున్నితంగా ఉండటం, నొప్పి, రొమ్ముల సైజు పెరగడం వంటివి జరుగుతాయి. పీరియడ్స్‌లో రొమ్ముల్లో వచ్చే ఈ మార్పులను ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ అంటారు. పీరియడ్స్‌లో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడంతో ఇలా జరుగుతుందంటున్నారు. పీరియడ్స్‌లో ఇది సాధారణమే కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అసాధారణ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 4, 2026
కల్కి పార్ట్-2లో 90 నిమిషాల పాటు కమల్!

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.


