News April 12, 2025
IPL: ఇవాళ ఓడితే కష్టమే!

సీజన్ తొలి మ్యాచులో గెలిచి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన SRH తర్వాత వరుసగా 4 మ్యాచులు ఓడిపోయి తుస్సుమనిపించింది. కేవలం 2 పాయింట్లతో టేబుల్‌లో చిట్టచివరన నిలిచింది. మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. దీంతో ఇవాళ పంజాబ్‌పై తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే తర్వాతి 8 మ్యాచుల్లో 7 గెలవడం కష్టమే. దీంతో SRH ఇంటిబాట పట్టడం లాంఛనమే అవుతుంది.
Similar News
News March 8, 2026
అందుకే భారత్‌కు మినహాయింపు: ట్రంప్

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పడిందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దాన్ని తగ్గించేందుకే భారత్‌కు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. దీని వల్ల రష్యాకు ఉపయోగం ఉండదన్నారు. వాణిజ్యంలో భారత్ తమకు కీలక భాగస్వామి అని అన్నారు. అటు ఆయిల్ కొనుగోలులో తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని USకు భారత్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News March 8, 2026
CA ఫలితాలు విడుదల

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <
News March 8, 2026
ఈ వారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ వారం(మార్చి 2-8) బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.6,870, తగ్గి రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.6,300 పడిపోయి రూ.1,50,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.25వేలు తగ్గి రూ.2,90,000లకు చేరింది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావించినా అనూహ్యంగా తగ్గడం గమనార్హం.


