News May 3, 2024
IPL: ఇవాళ ఓడితే ముంబై ఇంటికే!

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి IPLలో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడిన ఆ జట్టు కేవలం మూడింట్లోనే గెలిచి 6 పాయింట్లు మాత్రమే సాధించింది. టేబుల్లో చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉంది. ఇవాళ కోల్‌కతాతో మ్యాచులో ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టడం ఖాయం. MI ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు కావాలి. కానీ ఆ జట్టుకు మరో 4 మ్యాచులే ఉండటంతో వాటిలో గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం సాధ్యం కాదు.
Similar News
News January 27, 2026
‘యానిమల్’ సీక్వెల్‌పై రణ్‌బీర్ క్రేజీ అప్డేట్

యానిమల్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు రణ్‌బీర్ కపూర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వేరే సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు గుర్తుచేశారు. పైగా ఆయన దీన్ని 3 పార్ట్‌లుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్లో తాను డ్యుయల్ రోల్లో కనిపించే అవకాశం ఉందని చెప్పారు.
News January 27, 2026
భారత్-EU ఒప్పందాలపై ప్రధాని ట్వీట్

ఇండియా- యురోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పెట్టుబడులు & ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భాగస్వామ్యం ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక అడుగుతో IND-యూరప్ మధ్య సహకారం మరింత పెరగనుంది.
News January 27, 2026
భారత్ భారీ స్కోర్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 352-8 స్కోర్ చేసింది. విహాన్ సెంచరీ(109*) బాదగా, అభిజ్ఞాన్ కుందు 61, వైభవ్ సూర్యవంశీ 52, ఆరోన్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే(21), అంబ్రిష్ 21, ఖిలాన్ పటేల్ 30 రన్స్ చేశారు. కాగా గ్రూప్ స్టేజీలో హ్యాట్రిక్ విజయాలతో యంగ్ ఇండియా జోరుమీదున్న విషయం తెలిసిందే.


