News March 17, 2024
IPL ఒక సర్కస్ లాంటిది: మిచెల్ స్టార్క్

IPL ఒక సర్కస్‌లా ఎంటర్టైన్ చేస్తుందని ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నారు. ‘8ఏళ్ల తర్వాత మళ్లీ IPLలో ఆడటం ఒక కొత్త సవాలు. ఈ టోర్నీ ప్రపంచంలోనే బెస్ట్ T20 లీగ్. ఈసారి కొత్త జట్టుతో ఆడనుండటం ఉత్సాహాన్నిస్తోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2014, 2015 సీజన్లలో RCBకి ఆడిన స్టార్క్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. KKR అతడిని రూ.24.5కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 7, 2025
విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.
News December 7, 2025
పుతిన్ వెళ్లారు.. జెలెన్స్కీ వస్తున్నారు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు. శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న PM మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య ధోరణికి బలం చేకూర్చాయి.
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


