News September 28, 2024

IPL: క్రికెటర్లకు సూపర్ న్యూస్ చెప్పిన జైషా

image

IPLలో ఆడే క్రికెటర్ల పంట పండనుంది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్‌కు కాంట్రాక్టెడ్ అమౌంట్‌కు అదనంగా రూ.1.05 కోట్లు ఇస్తామని వెల్లడించారు. మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60 కోట్లు కేటాయించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా Xలో పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

image

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.

News November 2, 2025

నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

image

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News November 2, 2025

ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

image

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.