News April 11, 2025

IPL: చెన్నైని చిత్తు చేసిన KKR

image

చెపాక్ స్టేడియంలో చెన్నైని కేకేఆర్ చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 103 పరుగులే చేసింది. ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు వీరవిహారం చేశారు. నరైన్(44), డికాక్(23), రహానే(20) మెరుపులతో ఆ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఇది సీఎస్కేకు వరుసగా ఐదో పరాజయం.

Similar News

News November 27, 2025

వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

image

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.