News April 11, 2025

IPL: నేడు సీఎస్కేతో కేకేఆర్ అమీతుమీ

image

IPLలో భాగంగా నేడు చెన్నైలో CSKతో KKR తలపడనుంది. 2జట్లూ పాయింట్స్ టేబుల్‌లో వెనుకబడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే చెపాక్‌లో వరుసగా 3సార్లు పరాజయం చవిచూసిన తొలి జట్టుగా CSK ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది. అయితే ధోనీ మళ్లీ కెప్టెన్‌ కావడంతో అలా జరగదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అటు KKR సైతం CSK కోటలోనే ఆ జట్టును కొట్టాలని చూస్తోంది. దీంతో పోరు హోరాహోరీగా ఉండే ఛాన్సుంది. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Similar News

News November 18, 2025

తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

image

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్‌ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.

BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) ఘజియాబాద్‌లో 52 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, B.Tech అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. ఈ నెల 24న ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.472, SC,ST, PwBDలకు ఫీజు లేదు వెబ్‌సైట్: https://bel-india.in