News April 1, 2025
IPL: కేకేఆర్ చెత్త రికార్డ్

IPLలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా KKR నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌పై 10 సార్లు ఓడింది. ఈ క్రమంలో PBKS (కోల్‌కతాలో KKRపై 9 ఓటములు) పేరిట ఉన్న చెత్త రికార్డును చెరిపేసింది. మరోవైపు ముంబైపై కేకేఆర్ ఇప్పటివరకు 24 సార్లు ఓడింది. ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా నిలిచింది.
Similar News
News April 2, 2025
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: అనిత

AP: విశాఖలో ప్రేమోన్మాది దాడి <<15968879>>ఘటనపై <<>>హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీతో ఫోన్లో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అనిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. యువతి తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News April 2, 2025
HCU భూములపై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు చెట్లు కొట్టేయొద్దని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా HCU భూముల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వారం నుంచి జేసీబీలు, పొక్లెయిన్లతో అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించి చదును చేయిస్తోంది.
News April 2, 2025
RRకు గుడ్ న్యూస్.. సంజూకి లైన్ క్లియర్!

సంజూ శాంసన్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. వికెట్ కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించేందుకు ఆయనకు BCCI ఆమోదం తెలిపింది. IPLకు ముందు కుడి చూపుడు వేలు ఫ్రాక్చర్ కావడంతో సంజూ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ టెస్టుల్ని క్లియర్ చేయడంతో బెంగళూరులోని NCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.