News March 19, 2025
IPL: కోహ్లీ బ్యాటింగ్.. సహచరుడు అంపైరింగ్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిన్ననాటి సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ IPLలో అంపైరింగ్ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడారు. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాస్తవ (46) టాప్ స్కోరర్. ఆయన IPL (PBKS తరఫున) కూడా ఆడారు. శ్రీవాస్తవ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి అంపైరింగ్ చేస్తున్నా కోహ్లీ ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ పీక్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
12 గంటల్లో తుఫాన్.. భారీ వర్షాలు: APSDMA

AP: సెన్యార్ తుఫాన్ <<18394233>>ముప్పు<<>> తప్పి 24 గంటలు గడవకముందే మరో తుఫాన్ కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఈనెల 29లేదా 30న ఉదయం నాటికి TN, దక్షిణ కోస్తా తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.
News November 27, 2025
ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్

అన్ని దేశాల్లో డెంగ్యూ కేసులు పెరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే తొలిసారి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. Butantan-DV అనే ఈ టీకాను 12-59 ఏళ్ల ప్రజలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం డెంగ్యూకు TAK-003 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. WHO నిబంధనల ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండుసార్లు వేసుకోవాలి.
News November 27, 2025
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.


