News March 25, 2024

IPL.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో 100సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. దీంతో పాటు ఇదే మ్యాచ్‌లో అత్యధిక క్యాచులు(173) పట్టిన భారత ప్లేయర్‌గానూ అవతరించారు. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో రైనా(172), రోహిత్(167) ఉన్నారు.

Similar News

News February 2, 2026

టూరిస్ట్ స్పాట్‌గా డంప్‌యార్డ్.. ఎలా మారింది?

image

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్‌గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్‌యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్‌స్టా రీల్స్, సినిమా షూటింగ్స్‌కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.

News February 2, 2026

ఫైనల్లో భారత్ ఎదురైతే.. పాక్‌కు మాజీల ప్రశ్న!

image

T20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ‘ఫస్ట్ మ్యాచ్ బాయ్‌కాట్ సరే.. మరి ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా?’ అని దానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతోందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు ‘క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్‌తో ఆడకపోవడం బాధాకరమని అఫ్రీది అభిప్రాయపడ్డారు.

News February 2, 2026

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు: సజ్జల

image

AP: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బందిపోట్ల మాదిరి TDP తమ నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌ల ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో దొరికిపోవడంతో CBN ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక CBNకి రిటర్న్ గిఫ్ట్ తప్పని సరిగా ఇస్తామని హెచ్చరించారు.