News April 29, 2024
IPL: ఢిల్లీపై కోల్‌కతా ఘనవిజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. DC నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని KKR 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో సాల్ట్ 68, శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేశ్ అయ్యర్ 26 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది ఆరో విజయం కాగా, ఢిల్లీకి ఆరో ఓటమి.
Similar News
News November 24, 2025
32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
News November 24, 2025
ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.
News November 24, 2025
కాపర్ టి-రకాలు

అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్లు కాపర్ టిని సూచిస్తారు. దీంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి హార్మోనల్, మరొకటి నాన్ హార్మోనల్. హార్మోన్ కాపర్-టిలో లెవోనార్జెస్ట్రెల్ అనే హార్మోన్ విడుదలై శుక్రకణాలు అండం వద్దకు చేరకుండా ఆపుతుంది. నాన్ హార్మోనల్ కాపర్ టి రాగి అయాన్‌లను విడుదల చేస్తుంది. ఇవి శుక్రకణాలను, అండాలను నాశనం చేస్తాయి. వైద్యుల సలహాతో మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని వాడటం మంచిది.


