News November 25, 2024
IPL: మ్యాజిక్ మ్యాన్.. భలే ఎత్తుగడలు!
ఇతర ఫ్రాంఛైజీల పర్స్ మనీని ఖాళీ చేయడంలో కిరణ్ కుమార్ గ్రంధి దిట్ట. GMR గ్రూప్స్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు కుమారుడైన కిరణ్ ప్రస్తుతం DC కో-ఓనర్‌గా ఉన్నారు. నిన్న పంత్‌ను లక్నో రూ.21 కోట్లకు కొనేందుకు సిద్ధమవ్వగా కిరణ్ కుమార్ RTMతో భయపెట్టి ఆ రేటును పెంచేలా చేశారు. ఫలితంగా పంత్ కోసం లక్నో రూ.27 కోట్లు పెట్టాల్సి వచ్చింది. అలాగే స్టార్ బౌలర్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకే దక్కించుకున్నారు.
Similar News
News November 25, 2024
అండమాన్ జలాల్లో భారీగా డ్రగ్స్ సీజ్
అండమాన్ జలాల్లో నేడు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిషింగ్ బోట్లలో తరలిస్తుండగా 5 టన్నుల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ చరిత్రలోనే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.
News November 25, 2024
RGV ఇంటికి పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయమే ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. ఆయన విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. రెండు సార్లు నోటీసులివ్వగా ఆయన గడువు కావాలని కోరిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవడం విదితమే.
News November 25, 2024
ఈ ముగ్గురి చావుకు కారణం ఎవరు?
గూగుల్ మ్యాప్స్ చూస్తూ కారు నడపడంతో అది వంతెనపై నుంచి పడి <<14696822>>ముగ్గురు<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గూగుల్ మ్యాప్స్ తప్పిదంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పొరపాటూ ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 2022లో బ్రిడ్జిలో సగభాగం కొట్టుకుపోతే మిగతాది అలాగే వదిలేశారని, కనీసం బారికేడ్లు పెట్టలేదని ఫైరవుతున్నారు. ఆ రోడ్డు ఎందుకు క్లోజ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?