News March 22, 2025
IPL: రేపు హైదరాబాద్లో మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రెండో మ్యాచ్ రేపు HYD ఉప్పల్ వేదికగా జరగనుంది. హోం టీమ్ సన్రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఆదివారం మ.3.30 గంటల నుంచి క్రీడాభిమానులను అలరించేందుకు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 19 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.
Similar News
News January 20, 2026
నా సినిమా 23 ఆత్మహత్యలను ఆపింది: అంకిత్ సఖియా

తాను తెరకెక్కించిన ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ సినిమాకు ఎంతో మంది కనెక్ట్ అయ్యారని డైరెక్టర్ అంకిత్ సఖియా చెప్పారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న 23 మంది ఈ సినిమా చూశాక తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని దేశం మొత్తం చూపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా రూ.50 లక్షలతో తెరకెక్కిన ఈ గుజరాతీ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
News January 20, 2026
LRS.. ఇలా అప్లై చేసుకోండి

AP: 2025 జూన్ 30లోపు రిజిస్టర్ అయిన <<18903924>>ప్లాట్లు<<>> లేదా లే అవుట్లు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయం లేదా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. lrsdtcp.ap.gov.inలోకి వెళ్లి సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ప్లాట్ ప్లాన్, ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులో రూ.10వేలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఆ తర్వాత రాయితీ ఇస్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
News January 20, 2026
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 210 పోస్టులు.. అప్లై చేశారా?

<


