News March 23, 2025
ఉప్పల్‌లో IPL మ్యాచ్.. జాగ్రత్త బ్రో!

HYDలోని ఉప్పల్ వేదికగా ఇవాళ IPL జట్లు SRH, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. అయితే స్టేడియంలో ఆకతాయిల పని పట్టేందుకు ‘షీ టీమ్స్’ మఫ్టీలో మహిళల రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమ్మాయిలను ఇబ్బంది పెడితే తాటతీసేలా చర్యలు ఉండనున్నాయి. మరోవైపు 2,700 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. IPL స్కోర్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News March 25, 2025
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోలు మరణించిన విషయం తెలిసిందే.
News March 25, 2025
ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్

ఎల్లుండి ఉప్పల్‌లో లక్నోతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్షంగా హాజరయ్యే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీత కార్యక్రమంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్‌కు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది.
News March 25, 2025
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

విదేశీ పెట్టుబడుల వెల్లువ, అమెరికా మార్కెట్ల ర్యాలీ దృష్ట్యా భారత మదుపర్ల సానుకూల సెంటిమెంట్‌తో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్తున్నాయి. 30 షేర్ BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 418.54 పాయింట్లు లాభపడి 78,402.92కు చేరుకుంది. ఇక NSE నిఫ్టీ 107.85 పాయింట్లు పెరిగి 23,766.20 వద్ద ఉంది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, HCL టెక్, TCS, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా, మారుతి బాగా లాభపడ్డాయి.