News April 11, 2024
IPL: మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు!

వాంఖడేలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్లు విరాట్, మ్యాక్స్‌వెల్ విఫలమయ్యారు. కోహ్లీ 9 బంతుల్లో 3 రన్స్‌కు ఔట్ కాగా మ్యాక్స్‌వెల్ 4 బంతులాడి డకౌట్ అయ్యారు. ఈక్రమంలో మ్యాక్సీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(17) డకౌటైన ఆటగాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన చేరారు.
Similar News
News February 4, 2026
నవ గ్రహాలు – వాటి సొంత రాశులు

సూర్యుడు – సింహ రాశికి అధిపతి.
చంద్రుడు – కర్కాటక రాశికి అధిపతి.
బుధుడు – మిథున, కన్య రాశులకు అధిపతి.
కుజుడు – మేష, వృశ్చిక రాశులకు అధిపతి.
శుక్రుడు – వృషభ, తులా రాశులకు అధిపతి.
గురువు – ధనుస్సు, మీన రాశులకు అధిపతి.
శని – మకర, కుంభ రాశులకు అధిపతి.
రాహు, కేతువులు ఛాయాగ్రహాలు. అందువల్ల వీటికి ప్రత్యేక గృహాలు లేవు.
News February 4, 2026
ఆదాయం ఆపేస్తాం.. పాకిస్థాన్‌కు ICC లీగల్ వార్నింగ్!

భారత్‌తో మ్యాచ్ ఆడబోమని మొండికేస్తున్న పాక్‌కు ICC నుంచి గట్టి షాక్ తగిలేలా ఉంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన T20 WC మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. పాక్‌కు ICC నుంచి వచ్చే దాదాపు ₹300 కోట్ల యాన్యువల్ రెవెన్యూని నిలిపేస్తామని హెచ్చరించింది. బ్రాడ్‌కాస్టర్ జియోహాట్‌స్టార్ నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, అదే జరిగితే ఆ మొత్తాన్ని పాక్ ఆదాయం నుంచే రికవర్ చేస్తామని తేల్చి చెప్పింది.
News February 4, 2026
ఆన్‌లైన్ గేమ్ పిచ్చి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఘజియాబాద్(UP)లో వారు నివసిస్తున్న బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. బుధవారం వేకువజామున 2గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కరోనా నుంచి వీరు ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్‌కు అడిక్ట్ అయ్యారు. చదువు మానేసి మరీ గేమ్స్ ఆడుతుండటంతో పేరెంట్స్ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ ఒకేసారి బిల్డింగ్ పైనుంచి దూకేశారు.


