News May 22, 2024
IPL: మ్యాక్స్వెల్ చెత్త రికార్డు

ఈ సీజన్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్గా మ్యాక్స్వెల్ చెత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగు సార్లు సున్నాకే వెనుదిరిగారు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్సుల్లో 5.77 సగటుతో 59 పరుగులు చేశారు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్గా కార్తీక్(18) రికార్డును మ్యాక్సీ సమం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(17), పియూష్ చావ్లా(17), నరైన్(16) ఉన్నారు.
Similar News
News September 17, 2025
మైథాలజీ క్విజ్ – 8

1. రామాయణంలో మైథిలి అంటే ఎవరు?
2. కురుక్షేత్రంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ఎవరు?
3. ‘పుతనా’ రాక్షసిని చంపింది ఎవరు?
4. విష్ణువు శయనించే పాము పేరు ఏమిటి?
5. ‘బృహదీశ్వర ఆలయం’ ఎక్కడ ఉంది?
వీటి ఆన్సర్స్ మైథాలజీ క్విజ్-9 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17714352>>మైథాలజీ క్విజ్ – 7<<>> జవాబులు: 1.జయవిజయులు 2.సరయు 3.దేవవ్రతుడు 4.ఉత్తరాఖండ్ 5.వినాయక చవితి
News September 17, 2025
పలు శాఖల పనితీరుపై సీఎం ఆగ్రహం

AP: హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోంశాఖ, మున్సిపల్ శాఖలు సరిగా పనిచేయడం లేదని తనకు ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. అన్నిశాఖల మంత్రులు, అధికారులు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
అమరావతిలో క్వాంటం వ్యాలీ.. ఆకృతి ఇదే!

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. నిన్న కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించిన కట్టడాల ఆకృతినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాలీ కోసం 50ఎకరాలు కేటాయించగా, ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతి(A)లో నిర్మించనున్నట్లు సమాచారం. సాధారణంగానే పునాదులు నిర్మించి, మిగిలిన కట్టడాన్ని ప్రీ ఇంజినీరింగ్ సాంకేతికతతో వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.