News November 26, 2024
ముగిసిన IPL మెగా వేలం
IPL-2025 మెగా వేలం ముగిసింది. నిన్న, ఈరోజు జరిగిన ఆక్షన్‌లో ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రూ.వందల కోట్లు చెల్లించి కొనుగోలు చేశాయి. అత్యధికంగా రిషభ్ పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. IPL చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. IPL-2025 సీజన్ వచ్చే ఏడాది మార్చి 14న ప్రారంభం కానుంది.
Similar News
News November 26, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ టీమ్ ఇదే
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి ఢిల్లీ క్యాపిటల్స్ 23 మందిని తీసుకుంది. జట్టు: కేఎల్ రాహుల్, బ్రూక్, డుప్లెసిస్, కుల్దీప్, పొరెల్, స్టార్క్, స్టబ్స్, మెక్‌గుర్క్, ముకేశ్, చమీర, నటరాజన్, నాయర్, ఫెరీరా, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోశ్ శర్మ, మోహిత్, దర్శన్ నాల్కండే, విప్రజ్, అజయ్ మండల్, త్రిపురాణ విజయ్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి.
News November 26, 2024
నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు
1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది.
1967: విండీస్ మాజీ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ జననం.
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబైలో ఉగ్ర దాడి, 160 మందికిపైగా మృతి
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం
News November 26, 2024
కావ్యా మారన్ సంపద ఎంతో తెలుసా?
SRH సీఈవో కావ్యా మారన్ నెట్ వర్త్ రూ.409 కోట్లు అని ‘జన్ భారత్ టైమ్స్’ తెలిపింది. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించిన కావ్య చిన్నవయసులోనే తన తండ్రికి చెందిన వ్యాపారాల్లో అడుగుపెట్టారు. కావ్య తండ్రి, SRH కో-ఓనర్ కళానిధి మారన్ దేశంలోని సంపన్నుల్లో ఒకరు. ఆయన నెట్ వర్త్ రూ.19వేల కోట్లు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కళానిధి మారన్‌దే. సన్ గ్రూప్‌కు ఆయనే ఛైర్మన్.