News September 19, 2024

సౌదీ అరేబియాలో ఐపీఎల్ మెగా వేలం?

image

ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ సారి భారత్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. వేలం నిర్వహించేందుకు ఆ దేశం కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15లోగా రిటెన్షన్ల ప్రక్రియ పూర్తి చేసి అదే నెల మూడు లేదా నాలుగో వారంలో వేలం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రిటెన్షన్లపై బీసీసీఐ ఇంకా ఫ్రాంఛైజీలకు క్లారిటీ ఇవ్వలేదు.

Similar News

News November 20, 2025

సంగారెడ్డి: నీటి సంరక్షణపై భవిష్యత్: అదనపు కలెక్టర్

image

నీటి సంరక్షణ మీదనే భవిష్యత్ ఆధారపడి ఉందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ NGO’s ఆధ్వర్యంలో నీటి సంరక్షణ సుస్థిరమైన నీటి భవిష్యత్ కోసం సంఘాలను సాధికారపరచడం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవోలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసి ప్రారంభించారు.

News November 20, 2025

డాక్టర్ నిర్వాకం.. బాలుడికి ఫెవీక్విక్‌తో వైద్యం!

image

మీరట్‌(UP)లో జస్పిందర్ సింగ్‌ అనే వ్యక్తి కుమారుడు ఆడుతూ టేబుల్‌కు గుద్దుకున్నాడు. నుదుటిపై గాయం కావడంతో భాగ్యశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు రక్తం ఆపేందుకు గాయానికి ఫెవీక్విక్‌ వేసి వైద్యం చేశారని దంపతులు ఆరోపిస్తున్నారు. పిల్లాడి ఇబ్బంది చూసి మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు 3 గంటలు కష్టపడి గాయాన్ని శుభ్రంచేసి 4 కుట్లు వేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 20, 2025

పాము పొడ తెగులు నివారణ ఎలా?

image

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.