News November 24, 2024

IPL మెగా వేలం అప్‌డేట్స్

image

*స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన SRH
*ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపాను రూ.2.4 కోట్లకు దక్కించుకున్న SRH
*రూ.4.80 కోట్లకు ఖలీల్ అహ్మద్‌ను కొన్న CSK
*రూ.6.50 కోట్లకు నోర్ట్జేను సొంతం చేసుకున్న KKR
*అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన KKR
*మహీశ్ తీక్షణను రూ.4.4 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్

Similar News

News January 13, 2026

గ‌ర్భిణులు నువ్వులు తిన‌కూడ‌దా?

image

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.

News January 13, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

image

ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్‌ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానన్నారు. 15ఏళ్ల కెరీర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 300దాకా మ్యాచులాడారు. 7వేలకు పైగా రన్స్ చేశారు. 275మందిని ఔట్ చేశారు. ’35 ఏళ్ల వయసులోనూ AUS తరఫున ఆడాలనే ఉంది. కానీ నాలో పోటీతత్వం సన్నగిల్లింది’ అని అన్నారు.

News January 13, 2026

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు క్లోజ్

image

ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ACB కోర్టు మూసివేసింది. CID నివేదికకు ఆమోదం తెలుపుతూ CM చంద్రబాబు సహా 37 మందిపై విచారణను క్లోజ్ చేసింది. ‘మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్’గా నిందితులందరికీ విముక్తి కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అటు తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలన్న స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్ కె.అజయ్ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించింది.