News November 24, 2024

ఐపీఎల్ మెగా వేలం UPDATES

image

* నమన్ ధిర్‌ను రూ.5.25కోట్లకు కొనుగోలు చేసిన MI
* నెహాల్ వధేరాను రూ.4.20కోట్లకు కొనుగోలు చేసిన PBKS
* అభినవ్ మనోహర్‌ను రూ.3.20కోట్లు పెట్టి కొన్న SRH
* రఘువంశిని రూ.3కోట్లకు సొంతం చేసుకున్న KKR
* సమీర్ రిజ్విని రూ.95లక్షలకు దక్కించుకున్న DC
* రూ.30 లక్షలకు అథర్వ తైదెను దక్కించుకున్న SRH
* రూ.50 లక్షలకు కరుణ్ నాయర్‌ను కొన్న DC

Similar News

News October 15, 2025

IPS పూరన్ సూసైడ్: ట్విస్టులెన్నో.. (1/2)

image

TGకి చెందిన హరియాణా IPS అధికారి <<18001541>>పూరన్<<>> సూసైడ్ వెనుక ఎన్నో ట్విస్టులు. IT కథనం ప్రకారం.. రోహతక్ IGగా ఉన్న పూరన్‌ను PTCకి బదిలీ చేశారు. దీంతో సెలవు పెట్టి PSO సుశీల్‌తో కలిసి చండీగఢ్‌కు బయలుదేరారు. మధ్యలో ASI సందీప్ టీమ్ ఆ కారును ఆపి సుశీల్‌ను అదుపులోకి తీసుకుంది. ‘తర్వాత నీ వంతే’ అని పూరన్‌ను బెదిరించారు. ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ కోసం సుశీల్‌పై ఒత్తిడి చేసి వారం తర్వాత ACB కేసుపెట్టింది.

News October 15, 2025

IPS పూరన్ కుమార్ సూసైడ్ కేసులో ట్విస్టులెన్నో.. (2/2)

image

వీటిపై పూరన్ DGP, SPకి కాల్ చేసినా స్పందన లేదు. తర్వాత ఆయన సూసైడ్ చేసుకోగా భార్య కేసు పెట్టారు. మృతికి కులవివక్ష కారణమన్న విమర్శలు రేగడంతో DGP, SPని మార్చారు. ఈక్రమంలో పూరన్ అవినీతిపరుడని వీడియో తీసి ASI సందీప్ మరణించడం కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్ ఇందర్జిత్‌‌తో పూరన్‌కు ఆర్థిక ఒప్పందాలున్నట్లు అతడు ఆరోపించాడు. కులవివక్ష అంశంగా ఉన్న కేసు ఇప్పుడు అవినీతి, పోలీసులు-నేరగాళ్ల బంధం దిశగా మళ్లింది.

News October 15, 2025

కామన్‌వెల్త్ గేమ్స్: ఈ విషయాలు తెలుసా?

image

కామన్‌వెల్త్ <<18015617>>క్రీడలు<<>> 1930లో ‘బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో కెనడాలోని హామిల్టన్‌లో తొలిసారి జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్‌వెల్త్ గేమ్స్(1954-1966), బ్రిటిష్ కామన్‌వెల్త్ గేమ్స్(1970-1974)గా మారాయి. 1978 నుంచి కామన్‌వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందినవి ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2022లో ఇందులో 53 సభ్యదేశాలు ఉండగా 72 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.