News March 31, 2025

IPL: నేడు ముంబై, కోల్‌కతా పోరు

image

IPLలో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా రెండు వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇవాళ గెలవాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది. మరోవైపు కేకేఆర్ ఇప్పటివరకు రెండు మ్యాచులాడి ఒకదాంట్లో గెలిచి, మరొకటి ఓడింది. మళ్లీ విజయంతో గాడిలో పడాలని ఆ జట్టు భావిస్తోంది.

Similar News

News October 23, 2025

తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితకథ.. టైటిల్ రోల్‌లో స్టార్ హీరో

image

ప్రజానాయకుడు, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా పేరున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభ నుంచి ఐదు సార్లు MLAగా ఎన్నికయ్యారు.

News October 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 23, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.