News April 8, 2025

IPL: పోరాడి ఓడిన ముంబై

image

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్య(15 బంతుల్లో 42) వీరోచిత పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4 వికెట్లు, దయాల్, హేజిల్‌వుడ్ చెరో 2, భువీ ఒక వికెట్ తీశారు.

Similar News

News April 8, 2025

‘పరీక్షకు విద్యార్థుల ఆలస్యం’పై విచారణకు పవన్ ఆదేశం

image

AP: తన కాన్వాయ్ వల్ల విశాఖ పెందుర్తిలో విద్యార్థులు పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఎంత సేపు నిలిపారో, విద్యార్థులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎలా ఉందోనన్న విషయాలపై విచారణ చేయాలని వైజాగ్ పోలీసుల్ని ఆదేశించారు. కాగా.. పవన్ కాన్వాయ్ వెళ్లిన సమయంలోనూ ట్రాఫిక్‌ను ఎక్కడా ఆపలేదని వైజాగ్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

News April 8, 2025

నేడు గుజరాత్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఈరోజు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరవనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నిన్నే అక్కడికి చేరుకోగా మంత్రులతో కలిసి సీఎం నేడు పయనమవుతారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై సీఎం ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

News April 8, 2025

భారతీయులు గొప్ప ప్రతిభావంతులు: బిల్ గేట్స్

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇండియన్స్ గురించి మాట్లాడారు. ‘భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యల్ని సులభంగా పరిష్కరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. డిజిటల్ రంగంలోనూ ఇండియా శరవేగంగా దూసుకెళ్తోంది. భారత్‌లోని పేదలు కూడా చాలా తెలివైన వారు కానీ అవకాశాల్లేక వెనుకబడుతున్నారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!