News March 29, 2025
IPL: నేడు ముంబైVSగుజరాత్

IPLలో ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ ఇవాళ తుది జట్టులోకి రానున్నారు. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. మూడింట్లో GT, రెండింట్లో MI గెలిచింది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌ను రెండు జట్లు ఓటమితోనే ఆరంభించాయి. నేడు గెలుపు బోణీ కొట్టేదెవరో?
Similar News
News March 31, 2025
మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య

మయన్మార్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఘోర భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2056మంది చనిపోయినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. భూకంప తీవ్రతను ప్రపంచానికి చూపించేందుకు అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థల్ని దేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.
News March 31, 2025
IPL: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. MI తరఫున అశ్వనీ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు.
MI: రికెల్టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్, నమన్ ధిర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్
KKR: డీకాక్, అయ్యర్, రహానే, రింకూ, రఘువంశీ, నరైన్, రస్సెల్, రమన్‌దీప్, జాన్సన్, రాణా, వరుణ్ చక్రవర్తి
News March 31, 2025
బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీ నుంచి సల్మాన్ ఈద్ విషెస్

రంజాన్ సందర్భంగా అభిమానులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబైలోని తన ‘గెలాక్సీ’ హౌస్ బాల్కనీకి వచ్చి అభివాదం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉండటంతో సల్మాన్ బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను అమర్చారు. ఆయన అందులో నుంచే తన సోదరి అర్పిత ఖాన్ పిల్లలు ఆయత్, ఆహిల్‌తో ఫ్యాన్స్‌కు కనిపించి విషెస్ చెప్పారు.