News August 27, 2024

IPL: LSG కెప్టెన్‌గా నికోలస్ పూరన్?

image

తమ జట్టు కెప్టెన్‌గా హిట్టర్ నికోలస్ పూరన్‌ను LSG నియమించనున్నట్లు సమాచారం. అతడితోపాటు కృనాల్ పాండ్య పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే సీజన్ కోసం KL రాహుల్‌ను రిటైన్ చేసుకోవాలని LSG నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

జర్నలిస్టులకు అనంతపురం కలెక్టర్ గుడ్ న్యూస్

image

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పొడిగించిన గడువు 1.12.2025 నుంచి 31.1.2026 వరకు ఉంటుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ గమనించగలరు.

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం

News November 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.