News September 28, 2024
IPL: ఐదు రిటెన్షన్లతోపాటు ఒక RTM?

IPL 18 సీజన్ మెగా వేలానికి ముందు BCCI మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ కి 5 రిటెన్షన్లతోపాటు ఒక రైట్ టు మ్యాచ్ (RTM)కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫ్రాంచైజీల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. IPL 2025 మెగావేలం ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనుందని సమాచారం.
Similar News
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


