News March 29, 2024

2024లో అత్యధిక సిక్సులు కొట్టిన IPL ప్లేయర్స్

image

IPL-2024 టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుండగా ప్రతి మ్యాచ్‌లో ఆయా జట్ల ప్లేయర్లు సిక్సర్లతో అదరగొడుతున్నారు. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ SRH ప్లేయర్లు క్లాసెన్ 2 మ్యాచుల్లో 15 సిక్సులు కొట్టగా, అభిషేక్ శర్మ 9 సిక్సులు బాదారు. వీరి తర్వాత RR ప్లేయర్ పరాగ్ 2 మ్యాచుల్లో 9 సిక్సులు, KKR రస్సెల్ ఒక్క మ్యాచులో 7 సిక్సులు, MI ప్లేయర్ తిలక్ వర్మ 2 మ్యాచుల్లో 7 సిక్సులు కొట్టారు.

Similar News

News March 31, 2026

పిల్లల దత్తతకు ప్రత్యేక నిబంధనలు, అర్హతలు ఉంటాయి: కలెక్టర్

image

చైల్డ్ అడాప్ట్పై ప్రత్యేక నిబంధనలు, అర్హతలు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఆసక్తి గలవారు Central Adoption Resource Authority (CARA) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలన్నారు. ​ఒక సామాజిక కార్యకర్త ఆర్జీదారుల ఇంటిని సందర్శించి, జీవనశైలి, ఆర్థిక స్థితిపై నివేదిక సమర్పిస్తారన్నారు. ​ప్రక్రియ పూర్తయిన తర్వాత, న్యాయస్థానం దత్తతను ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు.

News March 31, 2026

BREAKING: చిత్తుగా ఓడిన చెన్నై

image

IPL: గువాహటి వేదికగా RRతో ఆడిన మ్యాచ్‌లో CSK 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. 128 పరుగుల లక్ష్యాన్ని RR 12.1 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ 17 బంతుల్లో 52, జైస్వాల్ 38*, జురెల్ 18, పరాగ్ 14* పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన CSK జట్టులో ఓవర్టన్(43), కార్తీక్(18), సర్ఫరాజ్(17) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్చర్, బర్గర్, జడేజా తలా 2, బ్రిజేశ్, సందీప్, బిష్ణోయ్ తలా వికెట్ తీశారు.

News March 30, 2026

హార్ముజ్ వద్ద భారత నౌకలకు ఛార్జీ లేదు: కేంద్రం

image

హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలకు ఇరాన్ అనుమతులు, ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. ఆ మార్గం ఇరుకుగా ఉండటంతోనే నౌకలు రావడం ఆలస్యమవుతోందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ తెలిపారు. ‘92వేల టన్నుల గ్యాస్‌తో 2 నౌకలు అక్కడి నుంచి బయలుదేరాయి. మరో 20 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నాయి. ఇందులో 5 LPG, 4 క్రూడాయిల్ ఓడలున్నాయి’ అని చెప్పారు.