News May 4, 2024
IPL ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందంటే?

IPL మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నిన్నటితో 51 మ్యాచ్‌లు పూర్తవగా, ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి అన్ని జట్లూ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. క్రిక్లెటిక్స్ క్వాలిఫికేషన్ ప్రొజెక్షన్ ప్రకారం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి RR, KKRకు 99% ఛాన్స్ ఉంది. SRHకు 72%, LSGకు 66%, CSKకు 50% అవకాశం ఉంది. తక్కువ పాయింట్లు ఉన్న DCకి 6%, PBKSకు 5%, GTకి 2%, RCBకి 1% ఛాన్స్ ఉండగా, MI ఎలిమినేట్ అయినట్లేనని పేర్కొంది.
Similar News
News December 10, 2025
HEADLINES

* ముగిసిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
* 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం: TG CM రేవంత్
* అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్రలో నేతలంతా పాల్గొనాలి: AP CM CBN
* అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు
* APలో లారీల బంద్ తాత్కాలిక వాయిదా
* ఈ నెల 12న అఖండ-2 విడుదల.. ప్రకటించిన మేకర్స్
* సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత్ ఘన విజయం
News December 10, 2025
ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 10, 2025
బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్‌ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.


