News October 31, 2024
IPL: పంజాబ్ కింగ్స్ పర్సులో రూ.112 కోట్లు

పంజాబ్ కింగ్స్ తన ప్రధాన ఆటగాళ్లందరినీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆ జట్టు పర్సులో ఏకంగా రూ.112 కోట్లు ఉన్నాయి. మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకే పంజాబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. కాగా అన్ని ఫ్రాంచైజీల వద్ద దాదాపు రూ.45 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకే డబ్బులు మిగిలి ఉన్నాయి.
Similar News
News November 28, 2025
నేటి నుంచి వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడతాయని వివరించింది. నేడు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
News November 28, 2025
అమ్మానాన్నల మీద నిందలు వేస్తున్నారా..?

మాతృ నింద మహా వ్యాధిః పితృ నింద పిశాచతః
దైవ నింద దరిద్ర స్యాత్ గురు నింద కుల క్షయం
ఈ శ్లోకం ప్రకారం.. తల్లిని నిందించే వారికి వ్యాధులు కలుగుతాయి. తండ్రిని నిందిస్తే పిశాచత్వం ప్రాప్తిస్తుంది. దైవ నిందతో దరిద్రులవుతారు. అలాగే గురువును నిందించినట్లయితే వంశమే నాశనం అవుతుందట. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పే గురువులను, లోకాన్ని సృష్టించిన దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదని అంటారు.
News November 28, 2025
WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.


