News May 15, 2024

IPL: పంజాబ్ టార్గెట్ 145 రన్స్

image

పంజాబ్‌తో మ్యాచులో రాజస్థాన్ 20 ఓవర్లలో 144/9 రన్స్ చేసింది. ఆ జట్టులో రియాన్ పరాగ్(48), అశ్విన్(28) మాత్రమే పర్వాలేదనిపించారు. జైస్వాల్ 4, కాడ్‌మోర్ 18, శాంసన్ 18, పావెల్ 4, జురెల్ డకౌట్ అయ్యారు. పంజాబ్ బౌలర్లలో కరన్, చాహర్, హర్షల్ తలో 2, అర్ష్‌దీప్, ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. పంజాబ్ విజయానికి 145 రన్స్ అవసరం.

Similar News

News January 11, 2025

సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి: KTR

image

TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్‌కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

News January 11, 2025

వారికి నెలకు రూ.2లక్షల జీతం

image

AP: క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్‌ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.

News January 11, 2025

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వచ్చి పుష్కరమైంది

image

పండుగొచ్చిందంటే చాలు టీవీల్లో శ్రీకాంత్ అడ్డాల తీసిన కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రసారమవుతుంది. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబాల మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు, పల్లెటూరి అందాలను ఎంతో చక్కగా చూపించారు.