News April 18, 2024
IPL: పంజాబ్ టార్గెట్ 193 రన్స్

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 192/7 స్కోర్ చేసింది. MI బ్యాటర్లలో సూర్య కుమార్ 78, రోహిత్ 36, తిలక్ 34 రన్స్‌తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ 3, సామ్ కరన్ 2 వికెట్లు తీయగా, రబడ ఒక వికెట్ పడగొట్టారు.
Similar News
News January 18, 2026
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.
News January 18, 2026
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News January 18, 2026
ఆ 88 గంటలు.. తీవ్రతను మాటల్లో వర్ణించలేం: రాజ్‌నాథ్

గతేడాది పాక్ ఉగ్ర శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 88 గంటలు కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అప్పుడు ఎదుర్కొన్న తీవ్రతను మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతి నిమిషం, నిర్ణయం చాలా కీలకమని తెలిపారు. ‘ప్రపంచంలో యుద్ధ రీతులు మారుతున్నాయి. కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇప్పుడు అవి సరిహద్దులకే పరిమితం కాదు’ అని నాగ్‌పూర్‌లో మందుగుండు సామగ్రి ప్లాంట్ ప్రారంభోత్సవంలో అన్నారు.


