News October 17, 2024

IPL: పంజాబ్ రిటెన్షన్ ఒక్కడే!

image

పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడినే రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా వేలంలో పొరపాటున కొన్న శశాంక్ సింగ్‌ను అట్టిపెట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా పంజాబ్ మొదటి నుంచీ రిటెన్షన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు అందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే నాణ్యమైన ఆటగాళ్లు అన్ని జట్లకు దొరుకుతారని వాదిస్తోంది. కానీ ఆ జట్టు అభ్యర్థనను BCCI అంత సీరియస్‌గా తీసుకోలేదు.

Similar News

News February 13, 2026

2029లో రాహుల్ PM.. తొలుత చేసే పని ఇదే: మాణికం ఠాగూర్

image

2029లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ PM అవుతారని ఆ పార్టీ MP మాణికం ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారంలోకి రాగానే పాలనలో పాతుకుపోయిన ‘సీక్రెసీ కల్చర్‌’ను రూపుమాపేలా గైడ్‌లైన్స్ తీసుకొస్తారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, ఆర్మీ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమే అయినప్పటికీ.. పాలనలో పారదర్శకత కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కని వ్యాఖ్యానించారు.

News February 13, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>ఎగ్జిమ్ <<>>బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 13, 2026

జటాజూటంలో నెలవంక ఎందుకయ్యా శివయ్యా?

image

శివుని జటాజూటంలోని నెలవంక మనస్సుపై నియంత్రణను సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఎప్పుడూ మారుతూ ఉంటాడు. అలాంటి చంద్రుడిని ధరించడమంటే చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థితప్రజ్ఞత సాధించడమే. ఇది అమృతత్వానికి చిహ్నం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనస్సును శాంతంగా, ధీరత్వంతో ఉంచుకోవాలని గుర్తుచేస్తుంది. కాలక్రమంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూనే, అంతర్గత శాంతిని కోల్పోకూడదని సందేశం!