News March 22, 2025

IPL: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు

image

ఇవాళ KKR-RCB మధ్య జరిగే IPL తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News December 9, 2025

చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

image

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్‌పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

News December 9, 2025

షాంఘైలో మహిళ నిర్బంధం.. ఏం జరిగింది?

image

పెమా వాంగ్ అనే మహిళ గత నెల లండన్ నుంచి జపాన్ వెళ్తుండగా తన ఫ్లైట్ ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. అయితే ఎయిర్‌పోర్ట్ అధికారులు తన పాస్‌పోర్టులో అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అది చెల్లదని 18గంటలు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆపై IND ఎంబసీని సంప్రదిస్తే సాయం అందినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. AR.P ఎప్పటికీ INDలో భాగమే అని, అక్కడి ప్రజలు భారత్ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారని చెప్పింది.

News December 9, 2025

డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1946: ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం