News May 24, 2024
IPL: కీలక వికెట్లు కోల్పోయిన రాజస్థాన్

SRH బౌలర్లు వరుస వికెట్లతో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. పవర్‌ప్లేలో ఒకే వికెట్ పడినా.. ఆ తర్వాత వరుసగా రెండు ఓవర్లలో 2 వికెట్లు తీశారు. షాబాజ్ బౌలింగ్‌లో జైస్వాల్ (42), అభిషేక్ శర్మ బౌలింగ్‌లో శాంసన్ (10) ఔటయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 10 ఓవర్లలో 73/3గా ఉంది. RR గెలుపుకు 60 బంతుల్లో 103 రన్స్ అవసరం. పరాగ్, జురెల్ క్రీజులో ఉన్నారు. SRH బౌలర్లు బౌండరీలు ఇవ్వకుండా టైట్ బౌలింగ్ చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
అల్కరాజ్ బోణీనా.. జకోవిచ్ 25వ ట్రోఫీనా!

టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఓ వైపు స్పానిష్ సంచలనం అల్కరాజ్ AUSలో బోణీ కొట్టాలని సిద్ధమయ్యారు. మరోవైపు తనకు కలిసొచ్చిన ఓపెన్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని జకోవిచ్ చూస్తున్నారు. అటు ఇటలీకి చెందిన వరల్డ్ నం.1 సిన్నర్ హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఉమెన్స్‌లో స్టార్ ప్లేయర్స్ సబలెంకా, స్వియాటెక్ టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు.
News January 18, 2026
నర్సింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: ప్రభుత్వాస్పత్రుల్లో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండో మెరిట్ లిస్టును మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. 2,322 పోస్టులకు గాను 1:1.5 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మెరిట్ లిస్ట్‌లో పేరున్న వారికి JAN 22 నుంచి FEB 7వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ వివరాలను అధికారిక <
News January 18, 2026
స్వర్గలోక ప్రాప్తి కోసం నేడు ఏం చేయలంటే?

చొల్లంగి అమావాస్య నాడు పితృదేవతలకు మోక్షం ప్రసాదించడానికి నదీ స్నానం చేయాలి. పితృ తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘నువ్వులు నింపిన రాగి పాత్రను, వస్త్రాలను, అన్నాన్ని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. మౌనవ్రతం పాటిస్తూ శివారాధన చేయడం వల్ల సకల జాతక దోషాలు తొలగి పుణ్యగతులు లభిస్తాయి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాల ప్రదక్షిణ మంచిది’ అంటున్నారు.


