News April 27, 2024

IPL: లక్నోపై రాజస్థాన్ విజయం

image

లక్నోతో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR 6 బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ శాంసన్ (71*), ధ్రువ్ జురెల్ (52*) రాణించారు. కాగా ఈ సీజన్‌లో RRకు ఇది ఎనిమిదో విజయం.

Similar News

News November 18, 2025

వాట్సాప్‌లో మీసేవ సర్వీసులు ప్రారంభం

image

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్‌లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

వైభవ్ సిక్సులపై ఒమన్ క్రికెటర్ల ఆశ్చర్యం

image

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ <<18288541>>హిట్టింగ్‌పై<<>> ఒమన్ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘14ఏళ్ల వయసులో అంత బలంగా సిక్సులను బాదడం మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం కాదు. వైభవ్‌ను ఇప్పటిదాకా టీవీల్లోనే చూశాం. ఇవాళ అతనితో పోటీ పడబోతున్నాం’ అని పేర్కొన్నారు. కాగా 8PMకు ఒమన్‌తో IND తలపడనుంది. ఈ టోర్నీలో వైభవ్ 144(42B), 45(20B) స్కోర్లు చేశారు. అందులో 15 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.