News April 7, 2025
IPL: నేడు ముంబైతో ఆర్సీబీ ఢీ

ఐపీఎల్లో భాగంగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడేలో ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. ముంబైకి రోహిత్, బుమ్రా ఇద్దరూ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జట్టు బలం పుంజుకోనుంది. అటు ఆర్సీబీలో బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో సమష్టిగా విజయాలు సాధిస్తోంది. రెండూ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు గెలుపెవరిదో చూడాలి.
Similar News
News April 9, 2025
ఫోన్‌పే, గూగుల్‌పే వాడే వారికి శుభవార్త

UPI పేమెంట్ల పరిమితిని పెంచేందుకు NPCIకి RBI అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం P2M(వ్యక్తి నుంచి వ్యాపారికి) పంపే లావాదేవీ పరిమితి ₹2లక్షల వరకే ఉంది. తాజాగా RBI అనుమతితో ₹5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. P2P లావాదేవీలను మార్చకుండా, P2M లిమిట్ మాత్రమే పెంచే ఛాన్సుంది. బ్యాంకులతో చర్చల తర్వాత NPCI దీనిపై ప్రకటన చేయనుంది. కాగా ఎడ్యుకేషన్, బీమా, హెల్త్ కేర్ రంగాలకు చేసే UPI పేమెంట్ లిమిట్ ₹5లక్షల వరకూ ఉంది.
News April 9, 2025
‘కన్నప్ప’ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 17న ఈ చిత్రం విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ‘కన్నప్ప’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆయనను కలిసిన వారిలో మంచు విష్ణుతో పాటు డాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఉన్నారు.
News April 9, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులతో అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.