News March 31, 2025

IPL: చెన్నైని దాటేసిన ఆర్సీబీ

image

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న IPL జట్టుగా ఆర్సీబీ నిలిచింది. మొత్తంగా 17.8 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానానికి ఎగబాకింది. దీంతో ఇప్పటివరకు మొదటి ప్లేస్‌లో ఉన్న CSK(17.7M)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో MI(16.2M) ఉంది. కాగా ముంబై, చెన్నై తలో 5 సార్లు టైటిల్ గెలవగా ఆర్సీబీ ఖాతాలో ఒక్కటీ లేదు. అయినా ఫాలోయింగ్‌లో మాత్రం అదరగొడుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News December 10, 2025

IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iimranchi.ac.in

News December 10, 2025

అమెజాన్ భారీ పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

image

ఇండియాలో ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌‌ను కీలకమైన మార్కెట్‌గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.

News December 10, 2025

మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

image

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.