News May 12, 2024
IPL: RCB స్కోర్ 187

ఢిల్లీతో మ్యాచులో RCB 187/9 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టులో తొలుత కోహ్లీ 27, జాక్స్ 41, పటీదార్ 52 ధాటిగా ఆడారు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లోమ్‌రోర్(13) దినేశ్ కార్తీక్(0), స్వప్నిల్ సింగ్(0) నిరాశపరిచారు. చివర్లో కామెరూన్ గ్రీన్(32*) పర్వాలేదనిపించారు. దీంతో 200 స్కోర్ దాటుతుందనుకున్న RCB.. 187 రన్స్‌కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, రసిక్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Similar News
News March 13, 2026
TODAY HEADLINES

*LPGపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు: మోదీ
*దేశంలో గ్యాస్ లభ్యతపై ఆందోళన నెలకొంది: రాహుల్
*పారిశ్రామిక హబ్‌గా ఏపీ: చంద్రబాబు
*నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తాం: రేవంత్
*TG: ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
*16న విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు
*US నౌకపై ఇరాన్ దాడి.. ఇండియన్ మృతి
*గ్యాస్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా పెంపు
News March 13, 2026
వార్ ఎఫెక్ట్.. కేంద్రానికి భారంగా ఫర్టిలైజర్ సబ్సిడీ!

ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాల కారణంగా ఎరువుల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి భారంగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీల బడ్జెట్ అంచనా ₹1.7లక్షల కోట్లు కాగా ఇప్పుడది ₹2.2 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్రవర్గాల సమాచారం. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ₹1.71లక్షల కోట్లలో ఫర్టిలైజర్ సబ్సిడీకి ₹1.16లక్షల కోట్లు, నాన్-యూరియా ఫర్టిలైజర్స్‌కు ₹54వేల కోట్లను కేంద్రం కేటాయించింది.
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.


