News May 19, 2024
IPL.. ఆర్సీబీ సూపర్ విక్టరీ

తప్పక గెలవాల్సిన మ్యాచ్లో RCB అదరగొట్టింది. CSKపై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్కి చేరుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర 61, రహానే 33 పరుగులు చేశారు. చివర్లో ధోనీ (25, 13 బంతుల్లో) జడేజా (42, 22 బంతుల్లో) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 2, మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గూసన్, గ్రీన్ తలో వికెట్ తీశారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


