News April 13, 2025
IPL: టాస్ గెలిచిన RCB

ఐపీఎల్‌లో భాగంగా ఆర్ఆర్‌తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, కృనాల్, జితేశ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్, యశ్ దయాల్.
RR: జైస్వాల్, శాంసన్ (C), రానా, పరాగ్, జురేల్, హెట్‌మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.
Similar News
News April 15, 2025
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

రేపటి నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30, మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని.. మళ్లీ JUL 25 నుంచి శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నాయన్నారు. కాగా APR 30న అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.
News April 15, 2025
ఆమిర్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి మూవీ?

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. వంశీ చెప్పిన స్టోరీ లైన్‌కు ఆమిర్ ఫిదా అయి పూర్తి స్క్రిప్ట్ వినిపించాలని కోరినట్లు సమాచారం. దీంతో స్క్రిప్ట్‌ని డెవలప్ చేస్తున్న ఆయన త్వరలోనే హీరోకు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఆమీర్ ఓకే చేస్తే దిల్ రాజు పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ నిర్మిస్తారని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.
News April 15, 2025
ALERT: నేటి నుంచి 3 రోజులు వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములతో వర్షం కురిసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.