News March 29, 2025
IPL: రికార్డు సృష్టించారు

MIతో మ్యాచ్లో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ రికార్డులు సృష్టించారు. ఐపీఎల్లో తొలి 27 ఇన్నింగ్సుల్లో అత్యధిక రన్స్(1,171) చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచారు. ఓవరాల్గా షాన్ మార్ష్(1,254) టాప్లో ఉన్నారు. అలాగే ఒకే వేదిక(అహ్మదాబాద్)లో వేగంగా(20INNS) 1,000 రన్స్ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా గిల్ రికార్డు సాధించారు. బెంగళూరులో 19 INNSలోనే వెయ్యి రన్స్ చేసి క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నారు.
Similar News
News January 12, 2026
ఈకల రంగును బట్టి కోళ్ల జాతిని గుర్తిస్తారు

ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలుంటే “కాకి”, తెల్లని ఈకలుంటే “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే “పర్ల”, ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే ‘డేగ’ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని, ఈకలు లేత బంగారు రంగులో ఉంటే ‘అబ్రాసు’ అంటారు.
News January 12, 2026
నెలాఖరులోగా SLBC పనులు ప్రారంభించాలి: మంత్రి ఉత్తమ్

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగ పనులను ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. <<18806199>>టన్నెల్ బోరింగ్ మెషీన్<<>>ను తొలగించిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో (DBM) పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లిస్తామని నిర్మాణ సంస్థకు హామీ ఇచ్చారు.
News January 12, 2026
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 132 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


