News April 10, 2024
IPL: RR vs GT వర్షం కారణంగా టాస్ ఆలస్యం

ఐపీఎల్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాజస్థాన్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. వర్షం పడుతుండటంతో టాస్ ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో స్టేడియం సిబ్బంది కవర్స్ తొలగించారు. కాసేపట్లో టాస్ వేసే అవకాశం ఉంది.
Similar News
News November 18, 2025
గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్కు అప్పగింత

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్ను భారత్కు అప్పగించినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్

TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహం వద్ద మ.12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News November 18, 2025
INDIA హసీనాను బంగ్లాకు అప్పగించకపోవచ్చు!

నిరసనల అణచివేతకు ఆదేశాలిచ్చి పలువురి మృతికి కారణమయ్యారనే ఆరోపణలతో దేశాన్ని వీడిన PM హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. నేరారోపణలున్న ఆమెకు ఆశ్రయం తగదని ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం వెంటనే అప్పగించాలని ఆ దేశం ఇండియాను హెచ్చరించింది. అయితే అందుకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 8, 29 ప్రకారం రాజకీయ ప్రేరేపిత, న్యాయ విరుద్ధ అభ్యర్థనను తోసిపుచ్చే అధికారం ఇండియాకు ఉంది.


