News April 25, 2025
IPL: RR ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!

రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. 9 మ్యాచ్‌లలో 7 ఓటములతో ఆ జట్టుకు రన్ రేటు -0.625 ఉంది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే మిగతా 5 మ్యాచ్‌లను అతి భారీ తేడాలతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టు 14 పాయింట్లను దాటకూడదు. అలాగే ఇతర జట్ల కంటే బెటర్ నెట్‌రన్ రేటు ఉండాలి. GT, DC, RCB, MI, PBKS అదరగొడుతున్నందున ఏదైనా అద్భుతం జరిగితే తప్ప RR ప్లేఆఫ్స్ వెళ్లలేదు.
Similar News
News April 25, 2025
హిందువులైతే ఇలా చేయరు.. ఉగ్రదాడిపై భాగవత్

పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.
News April 25, 2025
ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News April 25, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త చిత్రాలు

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.