News May 2, 2024
IPL: రుతురాజ్ అరుదైన ఘనత

చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో 500 పరుగులు చేసిన తొలి CSK కెప్టెన్‌గా నిలిచారు. గైక్వాడ్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 509 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ధోనీ నుంచి కెప్టెన్‌గా రుతురాజ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 16, 2026
షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్‌లైన్‌లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.
News March 16, 2026
వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)
News March 16, 2026
INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.


