News August 9, 2025
IPL: చెన్నైకి సంజూ? CSK ఆసక్తికర ట్వీట్

రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న సంజూ శాంసన్ CSKలో చేరి టీమ్ పగ్గాలు చేపడతాడని కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో CSK ఆసక్తికర ట్వీట్ చేసింది. రుతురాజ్ ఫొటోను షేర్ చేస్తూ ‘గొప్ప శక్తితో పెద్ద బాధ్యత వస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో తమ కెప్టెన్సీలో ఎలాంటి మార్పు ఉండబోదని పరోక్షంగా చెప్పింది. మరి RRను వీడాలనుకుంటున్న సంజూను ఏ జట్టు దక్కించుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Similar News
News August 10, 2025
త్వరలోనే మహిళలకు రూ.18వేలు: ఎంపీ కేశినేని చిన్ని

AP: కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కొక్కటిగా విజయవంతంగా అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం కానుందని చెప్పారు. ఆ తర్వాత త్వరలోనే ‘స్త్రీ నిధి’ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500(ఏటా రూ.18,000) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు.
News August 10, 2025
21 సార్లు డకౌటయినా పర్లేదన్నారు: శాంసన్

భారత T20 కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ గురించి శాంసన్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇస్తానని సూర్య చెప్పాడు. అయితే 2 మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాను. నిరుత్సాహంలో ఉన్న నన్ను గంభీర్ భాయ్ చూసి ఏమైందని అడిగారు. ఛాన్స్ యూజ్ చేసుకోలేకపోతున్నానని చెప్పా. పర్లేదు.. 21 సార్లు డకౌట్ అయితే పక్కనపెడ్తానని అన్నారు. వారి ప్రోత్సాహమే నన్ను నడిపించింది’ అని వ్యాఖ్యానించారు.
News August 10, 2025
మరోసారి సాగర్ గేట్లు ఎత్తే అవకాశం!

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. శ్రీశైలం జలాశయం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 43,999 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 309.35 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో పెరిగితే ఏ క్షణమైనా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.